సమంత నడుం బెంజి సర్కిల్‌ అన్నాడు.. ఆలీకిలాంటి కామెంట్లు మామూలే కదా అని ఊరుకున్నారు జనం. కానీ ఈసారి మరీ శ్రుతి మించి పోయాడు. నడుం దగ్గర్నుంచి కిందికి దిగి తొడల దగ్గరికి వెళ్లిపోయాడు. మొన్న అనుష్క తొడల గురించి ఆలీ చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేగుతున్నాయి. ఇంతకుముందు ఆలీ కామెంట్లను లైట్‌ తీసుకున్న జనాలు కూడా ఇప్పుడు అతడు హద్దులు దాటాడని అంటున్నారు. సోషల్‌ మీడియాలో, యూట్యూబుల్లో కొందరు అమ్మాయిలు ఆలీకి వ్యతిరేకంగా ఉద్యమం నడిపే పరిస్థితి వచ్చింది. త్వరలోనే ఆలీకి వ్యతిరేకంగా మహిళా సంఘాలతో కలిసి రోడ్డు మీదికి కూడా వస్తామంటోంది ఓ లేడీ.

ఈ సెగ ఆలీని కూడా తాకిందని.. అతను పని చేస్తున్న సినిమాల సెట్స్‌ దగ్గర కూడా వ్యవహారం చర్చకు వస్తోందని సమాచారం. ఐతే అనుష్క తొడల విషయంలో తాను చేసిన కామెంట్లకు బాధ్యత తనది కాదని.. తప్పు త్రివిక్రమ్‌, మహేష్‌ లదే అని తనదైన శైలిలో చమత్కారాలు చేస్తున్నాడట ఆలీ.

'ఖలేజా' సినిమాలో అనుష్క తొడల గురించి మహేష్‌ వేసే జోకులు గుర్తు తెచ్చుకుంటే ఆలీ ఆ కామెంట్లు ఎందుకు చేశాడో అర్థమవుతుంది. ఆ సన్నివేశంలో ఆలీ పక్కనుండగా.. ''దీని పిక్కలు చూశావా భయ్యా ఎలా ఉన్నాయో'' అంటాడు మహేష్‌. బహుశా ఈ సీన్‌ కోసం చాలా టేకులు తీశాడేమో త్రివిక్రమ్‌. అందుకే ఆలీ మనసులో ఆ సీన్‌ ముద్రించుకుపోయినట్లుంది. మొన్న ఆ ఆడియో ఫంక్షన్లో మాట తూలాడు. అయినా తప్పంతా త్రివిక్రమ్‌ ది అయితే ఆలీని తిట్టడం ఏం న్యాయం చెప్పండి.

Popular Posts

 
Top