కువైట్ పార్లమెంట్ 2016 లో అమలులోకి రాబోతున్న నూతన చట్టమైన అమీరి డిక్రీని ఆమోదించినట్లు సమాచారం.
వీసా వ్యాపారాన్ని అదుపులో ఉంచి, జనాభా పరిమాణాన్ని కాపాడుతుందని, సంబంధిత కమిటీ యొక్క అన్నీ సవరణలు పూర్తయిన తర్వాత ఈ సంవత్సరం ఆఖరిలో నూతన చట్టం వివరణలతో కూడిన ప్రకటన వెలువడుతుందని ఆధారాలు వెల్లడించాయి.
ఈ నూతన చట్టంలోని నూతన పద్దతుల వివరాలు – ఉపయోగాలు

- - కద్దామాలు మరియు ఇతర అధికారుల గురించిన నూతన చట్టాలను ఇందులో రూపొందించారు.
- - పౌరుల మరియు ప్రవాసుల ఆర్ధిక హక్కులను కాపాడే విధంగా ఈ నూతన చట్టం ఉంటుందని తెలిపారు.
- - కువైటీ కి మరియు ఏజెన్సీ కి మధ్య కద్దామాల నియామకానికి జరిగే ఒప్పందం ప్రకారం
- * కువైటీ కి మరియు ఏజెన్సీ కి మధ్య జరిగే లీగల్ స్పాన్సర్ షిప్ కాల పరిమితిని 100 రోజుల నుండి 6 నెలల వరకు పొడిగించడం జరిగింది.
- (ప్రస్తుతం కువైటీ కి 100 రోజుల లోపు కద్దామా పని తీరు నచ్చనిచో, ఏజెన్సీ వారికి కద్దామా నియామకం కోసం కువైటీ ఇచ్చిన డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేయాలి. లేనిచో ఆ కద్దామా స్థానంలో మరొకరిని కువైటీ ఇంటికి పంపించాలి.)
- * ఈ 6 నెలల లోపు ఏజెన్సీ వారు కువైటీ కి సరైన కద్దామా ను పంపించలేనిచో కువైటీ కట్టిన డబ్బును ఏజెన్సీ వారు తిరిగి చెల్లించాలి.
- * అదే విధంగా, ఈ 6 నెలల లోపు కద్దామా కువైటీ ఇంటి నుండి పారిపోయినచో ఏజెన్సీ వారు కువైటీ కట్టిన మొత్తం డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
- - కద్దామాలకు వ్యతిరేకంగా వారు పారిపోయినట్లు రిపోర్ట్ కనుక నమోదైతే వారిని GCC దేశాలలో ప్రవేశించకుండా నిషేధాన్ని విధించడం మొదలగు వాని గురించి ఈ నూతన చట్టంలో పేర్కొనబడింది.