కోచ్చడయాన్, లింగ సినిమాలు కొట్టిన దెబ్బల నుంచి కోలుకోవడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది సూపర్ స్టార్ రజినీకాంత్‌కి. ఎక్కువగా సీనియర్ డైరెక్టర్లతోనే పని చేసే సూపర్ స్టార్ ఈసారి కొంచెం భిన్నమైన దారిలో నడిచాడు. రెండే సినిమాలు చేసిన యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో ‘కబాలి’ సినిమా మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైనే పూర్తయింది. ప్రస్తుతం మలేషియలో లాంగ్ షెడ్యూల్ నడుస్తోంది.
సాధారణంగా రజినీ సినిమాకు తమిళంలో ఏం టైటిల్ పెడతారో దాన్నే తెలుగుకు కూడా ఫిక్స్ చేస్తారు. ఐతే ‘కబాలి’ విషయంలో అవకాశం లేదు. అది పక్కా తమిళ టైటిల్. అందుకే తెలుగు కోసం టైటిల్ మార్చాల్సిందే. ఐతే తెలుగు వెర్షన్‌కి ‘మహాదేవ్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ పోస్టర్లు కూడా వదలబోతున్నారట.
ఐతే మహాదేవ్ అనే టైటిల్ అంత పవర్ ఫుల్‌గా అయితే అనిపించట్లేదు. ఇంతకుముందు కూడా రజినీ సినిమాలకు తెలుగులో టైటిల్ మార్చినపుడు.. అంత మంచి రెస్పాన్స్ రాలేదు. విక్రమ సింహా, కథానాయకుడు టైటిళ్లు బాలేవన్న విమర్శలు వచ్చాయి. ఆ సినిమాలకు మంచి ఫలితాలు కూడా రాలేదు. మరి ‘మహాదేవ్’ అనే టైటిల్ కే ఫిక్సవుతారా.. ఇంకేదైనా మారుస్తారా.. వేచి చూడాలి.
Popular Posts
-
మేషరాశి: "రామేశ్వరం" : శ్లోకం:- "సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామే...
-
కాన్సర్ బి పి ఉన్నవారికి దేవుడిచ్చిన వరం మిత్రులందరికీ శుభోదయం ఈ రోజు మనం ప్రపంచం లోని అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలలో మన ఇంటి దగ్గర కూడా వ...